శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (17:01 IST)

కార్యసిద్ధి సమయం.. 11 దీపాలను కొబ్బరి నూనెతో వెలిగిస్తే..?

Varahi Puja
కార్యసిద్ధి సమయం మంగళవారం (21-03-23) సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వుంది. ఈ సమయంలో వరాహి మూర్తిగా వరాలను ఇచ్చే వరాహి దేవిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అలాగే వరాహి మూర్తిని వరాహి ముద్రతో వజ్ర ఘోషం అనే పదాన్ని పఠించాలి. 
 
అలాగే కార్యసిద్ధి దాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే సమీప ఆలయాన్ని సందర్శించడం, హనుమంతుడిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా కార్యసిద్ధి సమయంలో 11 దీపాలను, కొబ్బరినూనెతో వెలిగించడం ద్వారా సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.