గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (22:43 IST)

పంచమి తిథి- నవధాన్యాలతో గారెలు.. పెరుగన్నం..?

పంచమి తిథిలో వరాహి దేవిని ఇలా పూజిస్తే సమస్త దోషాలుండవు. పౌర్ణమి, అమావాస్య ముగిసిన ఐదో రోజున వరాహి దేవిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్తకన్యల్లో వరాహి దేవి ఒకరు.
 
మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే.. కార్యసిద్ధి కోసం వరాహి దేవిని పూజించడం ఉత్తమం. అదీ పంచమి తిథిలో వరాహి దేవి స్తుతితో అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ రోజున వ్రతమాచరించి పూజిస్తే.. రుణబాధలుండవు. ఆర్థిక సమస్యలుండవు. వయోబేధం లేకుండా పంచమి తిథి రోజున వరాహి దేవి కోసం వ్రతమాచరించవచ్చు.
 
అయితే పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వరాహి దేవి పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా పంచమి తిథిలో జన్మించిన జాతకులు పుట్టకు పాలు పోయడం.. వరాహి దేవిని పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది.
 
ఇంకా ఐదు నూనెలను కలగలిపి.. ఆమెకు దీపం వెలిగిస్తే సకలసంపదలు వెల్లివిరుస్తాయి. ఈ దీపానికి ఎరుపు వత్తులను వాడటం మంచిది. నైవేద్యంగా పొట్టు తీయని మినపప్పుతో తయారు చేసిన గారెలు లేకుంటే నవధాన్యాలతో చేసిన గారెలను, పెరుగన్నం, శెనగలు, పానకం వంటివి సమర్పించవచ్చు.