మంగళవారం, 4 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 నవంబరు 2025 (11:57 IST)

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

Ekadasi
Ekadasi
చాతుర్మాసం ముగిసింది. ఈ సంవత్సరం, ప్రబోధిని ఏకాదశి నవంబర్ 1న నేడు వచ్చింది. ప్రబోధిని ఏకాదశి, ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది నాలుగు నెలలు నిద్రించిన శ్రీ మహా విష్ణువు మేల్కొనే పర్వదినం. ఈ ప్రబోధిని ఏకాదశి నాడు కొన్ని పనులు అంతా శుభమే జరుగుతుంది. 
 
ఈ రోజు చేసే పనులతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ప్రబోధిని ఏకాదశి చాలా ప్రత్యేక ఏకాదశి. నేడు కదంబ వృక్షం లేదా కడిమి చెట్టును పూజించడం చాలా మంచిది. 
 
ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కదంబ వృక్షం అనేది దేవతా వృక్షం. మన పురాణాలలో కదంబ వృక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే నేడు కదంబ వృక్షాన్ని పూజిస్తారో వారికి జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని, ధనప్రాప్తి కలుగుతుందని చెప్తారు. 
 
కాబట్టి నేడు ప్రబోధిని ఏకాదశి నాడు కదంబ వృక్షం వద్దకు వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే..  జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషాన్ని, సుఖ శాంతులను ఇస్తుంది. మహావిష్ణువు అనుగ్రహంతో సకల సౌఖ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.