శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (14:06 IST)

గణపతికి మామిడి పండు సమర్పిస్తే.. ఫలితం ఏంటో తెలుసా?

ఏయే పండ్లను దేవరులకు నైవేద్యంగా సమర్పిస్తే.. ఎలాంటి ప్రతిఫలం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏదో పండు, పుష్పాలు పట్టుకెళ్లాలని ఆధ్యాత్మిక పండితులు అంటుంటారు. పండ్లు, కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని తీసుకెళ్లి పూజ చేయడంతో పాటు కొన్ని రకాల పండ్లను స్వామికి సమర్పిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. 
 
తలచిన పనులు నిర్నిఘ్నంగా ముందుకు సాగాలంటే.. యాలకి అనే అరటి పళ్లను దేవునికి సమర్పించడం చేయాలి. ఇలా చేస్తే.. నిలిచిన పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి. రుణ విముక్తి, రావాల్సిన సొమ్ము, నష్టపోయిన డబ్బు తిరిగి రావాలంటే అరటి గుజ్జుతో చేసిన పదార్థాలను స్వామికి సమర్పించాలి. 
 
కొబ్బరికాయను ఉపయోగిస్తే.. పనులు సులభ సాధ్యమవుతాయి. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరుతాయి. పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు. స్నేహపూర్వకంగా పనులు జరుగుతాయి. కమలాపండును స్వామికి సమర్పిస్తే.. చిరకాలంగా నిలిచిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు.
 
సపోటా పండును దేవతలను సమర్పిస్తే.. వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి.
 
ఇష్ట దైవానికి మామిడి పండు అంజూరపండ్లను నైవేద్యంగా సమర్పించి దాన్ని రజస్వల కాని ఆడపిల్లలకు తినిపిస్తే త్వరగా రజస్వల అవుతారని నమ్మకం. ఎటువంటి సమస్యలు రావంటారు. 
mangoes
 
అంజూర పండును సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తీరతాయి. స్వల్ప రక్తపోటు (లోబీపీ) ఉన్న వారికి మంచిది. కాళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నివారణ సంకల్పాన్ని చెప్పుకుని సుమంగళీలకు తాంబూలంలో సమర్పిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు. గణపతికి నైవేద్యంగా పెడితే మరింత ఆరోగ్య ఫలాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.