1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:55 IST)

అయ్యప్ప దీక్షకు చేయవలసిన నియమాలివే...

అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులే నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. అయ్యప్ప స్వామ దీక్షను చేపట్టే వారు

అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులే నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. అయ్యప్ప స్వామ దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలలను ధరిస్తారు. నుదుట చందనం విభూది పెట్టుకుంటారు.

 
విభూతి, గంధం పెట్టుకోవడం వలన చక్కని వర్ఛస్సు, ధైర్యం చేకూరుతుంది. పాదరక్షలు వేసుకోరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలున్నాయి. ఇందువలన భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభైయెుక్క రోజు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మెుద్దుబారిపోతాయి. అప్పుడే అడవులలో నడిచేందుకు వీలవుతుంది.
 
రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనడానికే నలుపు దుస్తుల ధారణ నియమం పెట్టారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టే అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మ చర్యం కూడా దీక్షలో భాగమైంది.