బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:45 IST)

పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే?

పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించారు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటుంటారు. శివలింగాన్ని అభిషేకించడం, శివారాధనం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్య

పరమశివుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించారు. ఆ స్వామిని లింగాకారంలోనే ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటుంటారు. శివలింగాన్ని అభిషేకించడం, శివారాధనం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెబుతున్నారు.
 
గంధంతోను, పిండితోను, కర్పూరంతోను చేసిన శివలింగాలను పూజించడం వలన వివిధ రకాల ఫలితాలు దక్కుతాయి. పటిక బెల్లంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన వివిధ రకాల వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. ప్రతి ఒక్కరూ కూడా తమకి ఆరోగ్యాన్ని ప్రసాదించమనే భగవంతుని కోరుకుంటారు. ఎందుకంటే అనారోగ్యాలు జీవితాన్ని సతమతం చేస్తుంటాయి. 
 
మానసికంగాను కుంగదీస్తాయి. అందువలన అనారోగ్యాలతో బాధపడేవారు పటిక బెల్లంతో చేసుకున్న శివలింగాన్ని పూజించడం వలన వాటి నుండి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది.