శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (10:46 IST)

అల్లుడులో 'ఆ' పవర్ లేదా? ఇంతవరకు శారీరకంగా కలవలేదట...

మా కుమార్తె కాస్త లావుగా ఉంటుంది. ఆమెను నచ్చిన యువకుడుతో వివాహం జరిపించాం. కానీ, వివాహమైన తర్వాత అమ్మాయి లావుగా ఉందని, తనకు నచ్చినట్టుగా నడుచుకోవడం లేదని ఇంతవరకు శారీరకంగా కలుసుకోలేదట. పైగా, తన భర్త పురుషులతో సన్నిహితంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. అంటే మా అల్లుడు స్వలింగ సంపర్కుడా? లేక ఇతర కారణాలతో అమ్మాయికి దూరంగా ఉంటున్నాడా? అతని సమస్య తెలుసుకునేదెలా? 
 
ఈ సమస్యకు వైద్య నిపుణులు స్పందిస్తూ, ఇలాంటి సమస్య చాలా మందిలో ఉంటుంది. దీన్ని కౌన్సెలింగ్‌ ఇచ్చి సరిదిద్దవచ్చు. అయితే అమ్మాయి అనుమానిస్తున్నట్టు అతను స్వలింగసంపర్కి అయిన పక్షంలో, అతన్ని మార్చడం వీలుపడదు. పైగా బలవంతంగా అతన్ని మార్చే ప్రయత్నం చేయటం చట్టవిరుద్ధం అవుతుంది. అమ్మాయి లావుగా ఉందనీ, తన మాట వినడం లేదనీ, అందుకే తను లైంగికంగా కలవలేకపోతున్నాననీ మీ అల్లుడు అంటున్న మాటల్లో అర్థంలేదు. 
 
పెళ్లికి ముందు అన్నీ తెలిసే అంగీకరించాడు. పెళ్లి చేసుకుంది. అందువల్ల ఆ సాకులు చూపించి ఆమెకు దూరంగా ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే అతని సమస్యను కరెక్టుగా నిర్ధారించాలంటే వైద్యులకు చూపించాలి. ఇందుకోసం అతనితో మాట్లాడి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు నేరుగా అల్లుడిని అడగకుండా, అతనికి సన్నిహితమైన స్నేహితులు, లేదా బంధువుల్లోని ఓ వ్యక్తికి విషయం వివరించి సమస్య తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అదేసమయంలో వీలుపడితే వైద్య పరీక్షలు చేయడం మంచిది.