సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (20:52 IST)

ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి ఎవరు?

జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
 
చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
 
జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.
 
చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
 
మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావుబ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి.
 
నిన్నటి గురించి మథనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
 
మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
 
మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్థమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.
 
మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు.
 
మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
 
చాలామంది ఇతరుల కంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
 
మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.
 
పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధరణంగా మనకు లభిస్తుంది.
 
మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
 
జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
 
తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
 
తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
 
నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.