గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (09:17 IST)

మహాశివరాత్రి ఉత్సవాలు.. రుద్రాభిషేకం, బిల్వార్చనతో సర్వం శుభం

Lord shiva
మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ శైవ ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి రోజున ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, అభిషేకాలను వీక్షించడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 
 
శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహా శివరాత్రి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే రోజు లింగోద్భవం జరిగిందని కూడా చెప్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ముఖ్యం. 
 
ఉదయాన్నే స్నానం చేసి శుచిగా స్నానమాచరించాలి. పాలు పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వుండాలి. పరమశివుడు పురుషుడిని సూచిస్తే, పార్వతీ దేవి ప్రకృతిని సూచిస్తుంది. 
 
సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. కనుక మహా శివరాత్రి చాలా ప్రత్యేకం. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుండి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని విశ్వాసం.