సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 మార్చి 2022 (23:08 IST)

బాలారిష్ట దోషాలు పోవాలంటే ఇలా చేయాలి?

ఏ రకమైన విద్యను అయినా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. ఈయన అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే. జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.

 
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్న వారు, గురువు తృతీయంలో ఉండటం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజిస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోషపరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించి “ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్” అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి.

 
మంత్ర జపానంతరం ధూప, దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.