గురువారం, 10 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 25 జులై 2018 (14:56 IST)

భక్తి మార్గాలతో షిరిడిసాయి అనుగ్రహం...

భక్తిలో తొమ్మది మార్గాలుంటాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం. వీటిల్లో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహ

భక్తిలో తొమ్మది మార్గాలుంటాయి. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం. వీటిల్లో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధించాడు. భక్తులు పక్షపాతి అయిన శ్రీ షిరిడిసాయి భక్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరిస్తాని బాబా చెబుతారు.
 
భక్తులను ఆయాబాధలనుండి విముక్తిలను చేస్తారు బాబా. ప్రేమించడం తప్ప ద్వేషించడం తేలియని సాయిబాబా తన భక్తులు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మందలిస్తారు. సమాధి నుండే సాయిబాబా భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పుతూ తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఎప్పటికి మరచిపోలేదు బాబా.
 
భక్తులు మెురపెట్టుకుంటే చాలు... బాబా వారి మెురను ఆలకిస్తాడు. అడిగినది తీరుస్తాడు. జలతారు వస్త్రాలు ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. సాయిబాబా బాటలో నడవాలంటే ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి.