ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారి లడ్డూ ప్రసాద పంపిణీకి నేటి నుంచి పేస్ రికగ్నేషన్ అమలు

ttdtemple
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి భక్తులు అమృతంగా పరిగణించే శ్రీవారి లడ్డూ ప్రసాదాల పంపిణీకి సరికొత్త విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందులోభాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి శ్రీవారి లడ్డూల ప్రసాదం పంపిణీ కోసం ఫేస్ రికగ్నేషన్‌ను అమలు చేయనున్నారు. 
 
ఇప్పటికే ఈ విధానాన్ని మంగళవారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, బుధవారం నుంచి శాశ్వతంగా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే శ్రీవారి భక్తులకు గదుల కేటాయింపులోనూ, ఖాళీ చేసే సమయంలోనూ ఫేస్ రికగ్నేషన్ విధానాన్నే అమలు చేయనున్నారు. 
 
గదుల కేటాయింపు, కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2‌లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఫేస్‌ రికగ్నేషన్ సాయంతో లడ్డూలు పంపిణీ చేస్తారు.