శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:27 IST)

భక్తులు లేకుండానే తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు

తిరుమలలో నిర్వహించే సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో, భక్తులకు అనుమతి ఇవ్వకుండానే ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహించనుంది.

ఆలయంలో ఉన్న కల్యాణోత్సవ మండపం ప్రాంగణంలో మూడు రోజుల పాటు వసంతోత్సవాలు జరుగనున్నాయి. వసంతోత్సవాల సందర్భంగా నిర్వహించే బంగారు రథంపై మలయప్పస్వామి ఊరేగింపును అధికారులు రద్దు చేశారు.

కాగా, తిరుమలలో రద్దీ సాధారణం కన్నా తగ్గింది. నిన్న స్వామివారిది దాదాపు 15 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.