శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (19:53 IST)

కోవిడ్ బారిన పడిన రఫెల్ నాదల్: ఆ టోర్నీలో ఆడేది డౌటే!

టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కోవిడ్ బారిన పడ్డాడు. ఈ మేరకు త్వరలోనే కరోనా నుంచి కోలుకుని గ్రౌండ్ అడుగుపెడతానని, భవిష్యత్ టోర్నమెంట్‌లపై తన ప్రణాళికలను తెలియజేస్తానని ట్వీట్ చేశాడు. 
 
తాను అబుదాబి టోర్నీ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నిర్వహించిన పీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేలినట్లు ట్వీట్ చేశాడు. గత కొద్దికాలంగా గాయంతో మేజర్ టోర్నీలను వదులుకున్న ఈ స్పానిష్ స్టార్ ఆటగాడు.. ఇటీవలే ఓ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడేందుకు అబుదాబి వెళ్లాడు. 
 
అతి త్వరలోనే తాను పూర్తిగా కోలుకుని తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని నాదల్ ట్వీట్ చేశాడు. దీంతో 20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన రాఫెల్ నాదల్.. జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేది అనుమానంగా మారింది. 
 
వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇప్పటికీ కాలిగాయం పూర్తిగా మానకపోవడం, ఇప్పుడు కరోనా బారిన పడటంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతడు పాల్గొనడంపై సందేహాలు కలుగుతున్నాయి.