మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (09:31 IST)

తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు దుర్గాదేవి ఇకలేరు

kondapalli durgadevi
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు కొండపల్లి దుర్గాదేవి ఇకలేరు. ఆమె వయసు 89 యేళ్లు. అఖిల భారత మహిళా సంఘం సీనియర్ నాయకురాలు కూడా. వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆమె తండ్రి వీర రాఘవరావు, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కేఎల్ నరసింహారావు ప్రభావంతో వామక్ష ఉద్యమాలవైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్రను పోషించారు. 
 
1974లో జరిగిన తొలి మహాసభలో దుర్గాదేవి ఐద్వా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె భర్త నరసింహా రావు. ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఆమె భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 9.10 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత ఖమ్మంలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దుర్గాదేవి మృతిపట్ల ఐద్వా జాతీయ నేత బృందా కారత్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు.