ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (16:44 IST)

తెలంగాణలో భూకంపం.. రిక్టర స్కేలుపై 4.0గా నమోదు

తెలంగాణలో భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించింది. రామ‌గుండం, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌ ప్రాంతాల్లో సమీపంలో స్వల్ప భూకంపం వచ్చింది. అక్టోబ‌ర్ 23,2021న మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయింది. 
 
దీంతో జ‌నం జ‌నం కాస్త భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ప‌లు చోట్ల ప‌లువురు భ‌యంతో ప‌రుగులు తీశారు. తెలంగాణలో భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోయినప్పటకీ.. వరుస ప్రకంపనల వల్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.