శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (14:23 IST)

సజ్జనార్ మా మంచి మారాజు అంటోన్న టీఎస్ఆర్టీసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

సజ్జనార్... ఏ పదవిలో వున్నా దానికి వన్నె తీసుకురావడం ఆయన స్టైల్. సిపిగా వుండగా నేరగాళ్ల గుండెల్లో దడ పుట్టించిన సజ్జనార్ ప్రస్తుతం టీఎస్ ఆర్టీసికి ఎండిగా వున్నారు. ఆర్టీసి అనగానే చాలామంది ఆ పదవిని తీసుకునేందుకు ఆసక్తి చూపరు. ఐతే సజ్జనార్ దేన్నయినా సవాలుగా తీసుకుని ముందుకు సాగుతుంటారు. టీఎస్ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని ఎలాగైనా లాభాల బాట పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు.

 
అదే సమయంలో ఉద్యోగులకు భరోసా కల్పించే ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నూతన సంవత్సరం సందర్భంగా తీపి కబురు చెప్పారు. దశలవారీగా ఆ ఉద్యోగులందర్ని పర్మినెంట్ చేస్తామని తెలిపారు. దీనితో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేవు. సజ్జనార్ మా మంచి మారాజు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 
ఇకపోతే... నూతన సంవత్సరం సందర్భంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. రాబోయే కాలంలో దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.