మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (08:39 IST)

టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ కేసు - 40 మందికి సిట్ నోటీసులు

tspsc logo
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన గ్రూపు-1 పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ కేసును ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేసింది. అయితే, లీక్ కేసులోని నిందితురాలు రేణుక కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టి 40 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందికి సిట్ నోటీసులు జారీచేసింది. వారిలో ఇప్పటికే పది మందికి గ్రూపు-1 పోటీ పరీక్షలు రాసినట్టు తేలింది. గ్రూపు-1 పరీక్షలు రాసినవారితోపాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా ఈ నోటీసులు జారీచేసింది. 
 
కాగా, లీక్ కేసులో నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో కూడా సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తుంది. ప్రశ్నపత్రం గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ మాట్లాడినట్టు సిట్ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో రేణుక కాల్ డేటా ఇపుడు కీలకంగా మారింది. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తుంది. దీంతో ఈ పేపర్ లీకేజీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఆసక్తిగా సాగుతుంది.