సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (12:43 IST)

పరీక్ష హాలులో మహిళ.. ఏడుస్తున్న పాప.. పోలీసులు ఏం చేశారంటే?

boy
జోగుళాంబ గద్వాల్ జిల్లా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రూప్-1 పరీక్షల కోసం ఆరు నెలల పాపాయితో వచ్చిందో మహిళ. కానీ ఆ మహిళ పరీక్ష రాస్తుండగా.. పాపాయి ఏడవటం మొదలెట్టింది. ఆపై ఏం జరిగిందంటే... పూర్తి వివరాలు.. జోగుళాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గంజిపెట్ సరస్వతి స్కూల్ కు ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన లక్ష్మి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు తన 6 నెలల చిన్నారిని తీసుకొని భర్త దినకర్ తో వచ్చి పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లగా గంట తరువాత చిన్నారి ఏడ్వటం మొదలు పెట్టింది. తండ్రి ఎంత లాలించిన ఏడుపు ఆపలేదు. దీంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే తన భార్య లక్ష్మి నీ బయటకు పిలవండని అక్కడి పోలీస్ సిబ్బందికి తెలిపాడు.
 
అయితే.. ఈ విధంగా మధ్యలో పిలువకూడదని చెప్పడంతో భార్యను పిలవండి వెళ్ళిపోతామని అధికారులతో చెప్పాడు. దీంతో పరీక్ష రాసే మహిళను బయటికి రానీయకుండానే.. ఆమెను డిస్టబ్ చేయకుండా అక్కడి పోలీస్ అధికారులు, సిబ్బంది పాప తండ్రికి నచ్చజెప్పి పోలీస్ కానిస్టేబుల్ రజనీకాంత్ ఆ పాపను తీసుకొని సాగర్ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఏడుపు మాన్పించి ఎగ్జామ్ పూర్తి అయ్యేవరకు పాపను లాలిస్తూ అనంతరం పాప తల్లికి అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.