ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (19:53 IST)

ఫార్ములా ఇ- రేస్‌.. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

ఫిబ్రవరి 11న జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా ఇ- రేస్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 నుంచి హైదరాబాద్ నడిబొడ్డున వున్న హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
 
తెలుగు తల్లి ఫ్లై-ఓవర్ నుండి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ , మింట్ కాంపౌండ్ నుండి ఐ మ్యాక్స్ వరకు ట్రాఫిక్ అనుమతించబడదు. హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ - అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మంగళవారం అధికారులతో కలిసి ఫార్ములా రేస్ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
 
పోటీకి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో రోడ్ల పాక్షిక మూసివేత అమల్లోకి వస్తుందని, ఫిబ్రవరి 11 వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఫార్ములా ఇ రేస్ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం చర్చించారు.