బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (12:16 IST)

ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి దూరంగా మంత్రి కేటీఆర్

ktrao
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని బుధవారం ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం బీఎర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. అలాగే, తెరాస మంత్రులు, ఎంపీలు కూడా అక్కడే ఉన్నారు. అయితే, సీఎం కేసీఆర్ తనయుడు, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇప్పటికే ఖరారైన అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో బీఎర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. ముఖ్యంగా, జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ బీఎర్ఎస్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. 
 
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు కూడా హాజరుకానున్నారు. ఇందుకోసం తెరాస భారీ ఏర్పాట్లు చేసింది.