గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (13:53 IST)

ధ‌నుష్ గురించి చెప్పేసిన ఐశ్వ‌ర్య‌

Aishwarya Rajinikanth
గ‌త కొద్దికాలంగా ఎడ‌మొహం పెడ‌మొహంగా వున్న ఐశ్వ‌ర్య‌, ధ‌నుష్‌లు ఇక‌నుంచి దాన్ని నిజం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని త‌న చేష్ట‌ల ద్వారా ఐశ్వ‌ర్య చెప్ప‌క‌నే చెప్పేసింది. గ‌త కొంత‌కాలంగా వీరి వైవాహిక జీవితానికి సెల‌వ్ అన్న‌ట్లు ప్ర‌క‌టించిన సోష‌ల్‌మీడియాలో పెద్ద చ‌ర్చ సాగింది. ఆ త‌ర్వాత ధ‌నుష్ తండ్రి కూడా వీరిద్ద‌రి క‌లిసేవున్నారు. చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్థ‌లు వుండ‌డం స‌హ‌జ‌మే అని తేల్చి చెప్పారు. కానీ ఆయ‌న మాట‌లు నిజంకాద‌ని తెలిసిపోయింది.
 
తాజాగా  త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఐశ్వ‌ర్య ధ‌నుష్ పేరును తీసేసి ఐశ్వ‌ర్య ర‌జ‌నీ అంటూ మార్చేసింది. దీంతో త‌న మ‌న‌సులోని విష‌యాన్ని స్ప‌ష్టంగా తెలియ‌జేన‌ట్ల‌యింది. కానీ  ఇది అందరికీ షాక్ ఇచ్చేలా ఐశ్వర్య చేసింది. ఇటీవ‌లే త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ముసాఫిర్ చిత్రంలోని ఆల్బ‌మ్ గురించి మాట్లాడింది. అప్పుడు కూడా చిన్న వీడియో ద్వారా మాట్లాడుతూ `ది ఈజ్ ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌` అంటూ పేర్కొంది. సో. ఇక ధ‌నుష్‌తో వీడిపోతున్న‌ట్లుగా వెల్ల‌డించిన‌ట్లుగా ఆమె మాట‌లు వున్నాయి. ఐశ్వ‌ర్య మ‌రో సినిమాకూ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతోన్న‌ట్లు తెలిసింది. ఇక ధ‌నుష్ సౌత్‌తోపాటు హాలీవుడ్ ప్రాజెక్ట్‌నూ చేయ‌బోతున్నాడు.