గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 జూన్ 2022 (23:36 IST)

ఇన్‌స్టాగ్రాం పోస్టులతో సమంతకు వచ్చిపడుతున్న కోట్ల రూపాయలు

Samantha
సమంత రూత్‌ప్రభు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సమస్యలపైనా, లైఫ్ స్టైల్ పైనా, తను నటించే చిత్రాల పైన, తన లైఫ్ గురించి... ఇలా రకరకాలుగా పోస్టులు చేస్తుంటుంది సమంత. ఐతే సమంత ఇన్‌స్టాగ్రాం ద్వారానే నెలకి రూ. 3 కోట్లకు పైగా సంపాదిస్తుందంటే ఆమె స్టామినా ఏంటో అర్థమవుతుంది.

 
మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన సమంత... జస్ట్ ఒక్క పోస్ట్ పెడితే చాలు మిలియన్లకొద్దీ ఫ్యాన్స్ ఆమె పోస్టును ట్రెండ్ చేసేస్తారు. అలా విపరీతంగా ఆమె పోస్టు చేసినవి వైరల్ అవుతుంటాయి. ఇవే ఇప్పుడు సమంతకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతున్నాయి.

 
సమంత ఒక్కరే కాదు... ఇన్‌స్టాగ్రాంతో ప్రియాంకా చోప్రా రూ. 3 కోట్లు, అలియా, కత్రినా కోటి రూపాయల చొప్పున ఏదేని బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే అంతమొత్తం తీసుకుంటారట. మొత్తమ్మీద సమంతకి సినిమాల సంగతేమో కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా కోట్లలో డబ్బులు వచ్చిపడుతున్నాయి.