ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:27 IST)

క్రిష్‌తో ఓపెన్‌గా ఆ విషయాన్ని మాట్లాడేసిన పవన్ కళ్యాణ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని సినీరంగంలోకి మళ్ళీ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం మళ్ళీ సినిమాలను ఎంచుకున్నారు. అలా అని రాజకీయాలను వదిలిపెట్టలేదు. గ్యాప్ దొరికితే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
 
ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాతో పాటు క్రిష్ దర్సకత్వం వహించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారట. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు హరీష్ శంకర్ దర్సకత్వంలోను ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. దీంతో బిజీబిజీగా ఉన్నారాయన.
 
అయితే క్రిష్‌‌తో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతనితో మనసు విప్పి మాట్లాడారట. ఇంతకుముందే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. దీంతో రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వివరించారట. అలాగే తిరిగి సినీరంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందోనని కూడా చెప్పారట.
 
దీంతో క్రిష్‌ అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఏదీ ఆలోచించకండి. ఆర్థిక పరిస్థితి కుదుటపడేందుకే కదా మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. విమర్సలు చేసే వారు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోవద్దండి అంటూ సర్దిచెప్పారట క్రిష్.