బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

బాలీవుడ్ నటి రాఖీసావంత్ తల్లి జయ భేడా మృతి

rakhi sawanth
బాలీవుడ్ సెక్సీ బాంబ్ రాఖీసావంత్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి జయ భేడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను ఆదివారం ముంబై అంధేరి వెస్ట్‌‍లోని ఒసివారాలోగల మున్సిపల్ క్రిస్టియన్ శ్మశానవాటికలో పూర్తి చేశారు. 
 
జయభేడా గత కొంతకాలంకా ఎండోమెట్రియల్ కేన్సర్ నాలుగో దశతో బాధపడుతూ వచ్చారు. దీంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం పనీతీరు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే ఆమె మృతికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. 
 
మరోవైపు, తన తల్లి మృతిపై జయభేడా రాఖీసావంత్ ఓ ట్వీట్ చేశారు. తన తల్లి పడకపై ఆఖరి క్షణాల్లో ఉండగా, రాఖీసావంత్ కింద కూర్చొని ఏడుస్తుండగా ఈ వీడియోను తీసి, తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఉద్వేగభరితమైన టెక్స్ట్‌ను జతచేసింది. 
 
"ఈ రోజు నా తల నుంచి నా తల్లి చేయి దూరమైంది., ఇంక నేను కోల్పోవడానికి ఏమీ లేదు. ఐ లవ్  యూ అమ్మా... నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు. ఇపుడు నేను ఎవరితో మాట్లాడాలి. నన్ను ఎవరు ప్రేమగా కౌగలించుకుంటారు. నేనేం చేయాలి. నేను ఎక్కడికి పోవాలి. ఐ మిస్ యూ అమ్మా అని పేర్కొంది.