గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (17:26 IST)

బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన తెల్లపిల్ల ఎవరు?

గత కొన్నేళ్ళుగా మిల్కీ బ్యూటీ తమన్నా ఫేడ్ అవుట్ అయిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అలా అనే వారి నోరు మూయిస్తూ కొత్త ప్రాజెక్టులు , క్రేజీ సినిమాలకు సైన్ చేసి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనవరికి ముందు వచ్చిన సినిమాలు తమన్నాకు ఫెయిల్యూర్లు మిగిల్చినా 'F2'తో మళ్లీ పుంజుకుని హిట్ ట్రాక్‌లోకి వచ్చింది. ఇప్పుడు తమన్నాకు ఫుల్లుగా ఆఫర్లు తలుపుతడుతున్నాయి. 
 
తాజాగా మరో క్రేజీ బాలీవుడ్ ఆఫర్ ఆమెకు వచ్చిందట. బాలీవుడ్‌లో ఉన్న అద్భుతమైన నటుల్లో నవాజుద్ధీన్ సిద్ధిఖి ఒకరు. నవాజ్ హీరోగా తెరకెక్కనున్న బోలె చూడియా సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను తీసుకున్నారట. ఈ సినిమాకి హీరోయిన్‌గా మొదట మౌని రాయ్‌ను ఎంపిక చేశారట. కానీ ఆఖరి నిమిషంలో మౌని రాయ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని, అందుకే ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీకి అవకాశం దక్కిందని సమాచారం. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. 
 
మిల్కీ ఇప్పటికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది కానీ బ్రేక్ మాత్రం రాలేదు. మరి ఈ సినిమాతో అయినా తను ఆశిస్తున్న బ్రేక్ సాధిస్తుందేమో చూడాలి. ఈ ఆఫర్‌పై స్పందించిన తమన్నా ఇలాంటి మల్టీ లేయర్స్ ఉన్న పాత్రను పోషించడం తనకు మొదటిసారి అని, ఈ సినిమా కథ సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక సమస్యపై ఉంటుందని తెలిపింది. 
 
నవాజుద్ధీన్ సిద్దిఖి సోదరుడు షమాస్ నవాబ్ సిద్దిఖి ఈ సినిమాతో దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నాడట.