ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (13:08 IST)

డబ్బింగ్ స్టూడియోలో అల్లు అర్హా.. సింహంపై స్వారీ చేస్తూ..

Allu Arha
Allu Arha
పుష్ప - ది రైజ్'తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత పుష్ప2లో నటిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా ఓ మలయాళ సినిమాలో నటించనుందని టాక్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా సినీ అరంగేట్రం చేస్తుందని టాలీవుడ్ వర్గాలు కన్ఫార్మ్ చేశాయి.
 
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో కనిపించనుంది. అలాగే అల్లు అర్జున్ చిన్న కూతురు అర్హా సమంత నటించిన 'శాకుంతలం'లో తెరపైకి అడుగుపెట్టనుంది. డబ్బింగ్ స్టూడియో నుండి తన కుమార్తె ఫోటోను సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ పంచుకున్నాడు. 
 
అల్లు అర్జున్ నాలుగేళ్ల కూతురు అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన 'శాకుంతలం'లో నటించనుంది. యువ రాకుమారుడు భరతుడి పాత్రలో లిటిల్ అర్హా కనిపించనుంది. తాజాగా విడుదలైన 'శాకుంతలం' ట్రైలర్‌లో, అర్హా సింహంపై స్వారీ చేస్తూ ప్రిన్స్ భరతుడిగా కనిపించింది.