శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (15:23 IST)

ఛాన్స్ ఇస్తా.. నా కోరిక తీరుస్తావా అన్నాడు : యాంకర్ విష్ణుప్రియ

vishnupriya
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ భీమనేని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వర్థమాన నటీమణులే తమ మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉందన్నారు. అవకాశం కోసం కోర్కె తీర్చడం లేదా నిర్ద్వద్వంగా తోసిపుచ్చడం అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క చిత్రసీమలోనే కాదు, ప్రతి చోటా ఉందన్నారు. అయితే, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది అమ్మాయిల చేతిలోనే వుందన్నారు. అవకాశం కోసం లొంగిపోవడమా? లేదా తోసిపుచ్చడమా? అనేది వారే నిర్ధారించుకోవాలన్నారు. 
 
తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. సినిమా అవకాశం ఇస్తాను తన కోర్కె తీరుస్తావా అని ఓ దర్శకుడు కెరీర్ ప్రారంభ రోజుల్లో అడిగారని చెప్పారు. అయితే, తాను ఆయన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. ఈ కారణంగా ఆ తర్వాత అనేక అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అయినప్పటికీ తాను బాధపడటం లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న పనితో సంతృప్తి చెందుతున్నట్టు చెప్పారు.