మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (14:35 IST)

మళ్లీ కలుసుకోనున్న బాలకృష్ణ - విజయసాయి రెడ్డి... ఎందుకో తెలుసా?

tarakaratna
రాజకీయాల్లో బద్ధ విరోధులుగా ఉన్న సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిలు మళ్లీ కలుసుకోనున్నారు. అయితే, వీరిద్దరూ మళ్లీ కలుసుకోనుండటానికి ఓ కారణం ఉంది. ఇటీవల మరణించిన సినీ నటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ కల్చరల్ సెంటరులో జరుగనుంది. 
 
మధ్యాహ్నం 12 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్‌గా బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు. 
 
తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాలయ్య అన్నీ తానై చూసుకున్నారు. విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. 
 
చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలయ్య, విజయసాయి కలవబోతున్నారు.