శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (18:00 IST)

చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన మణిశర్మ

Mani Sharma
Mani Sharma
చిరంజీవి గురించి మణిశర్మ చాలా ఆసక్తికర విషయాలు తెలియజేశారు. మణిశర్మను చిరంజీవి అవకాశాలు కల్పించి పేరు తెచ్చేలా చేశాడు. అందుకే చిరంజీవి అంటే మంచి ట్యూన్స్‌ ఇవ్వాలని తను ఆరాటపడుతుంటాడు. చూడాలని ఉంది అనే సినిమాలో ‘రామ్మా చిలకమ్మా..’ అనే పాటకు కొత్త గాయకుడిచేత పాడిరచారు. సహజంగా బాలుగారు అన్ని పాటలు పాడతారు. కానీ ఇది పెక్యులర్‌గా వుండాలని అనడంతో చిరంజీవిగారి పర్మిషన్‌ తీసుకుని ఉదిత్‌నారాయణ్‌చేత పాడిరచారు. అది చాలా హిట్‌ అయింది. అసలు ఆ సినిమాను అశ్వనీదత్‌, రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తీయాలనుకున్నారు. అందుకు చాలా కసరత్తు జరిగింది. రెండేళ్ళపాటు ఆగాక, మరలా సెట్‌పైకి వచ్చి గుణశేఖర్‌ తెరపైకి వచ్చాడు.
 
ఇక ఆచార్య సినిమా విషయంలో చిన్న క్లారిటీ మిస్‌ అయింది. చిరంజీవి సినిమాలో పాటలు, సంగీతం బాగున్నాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో ఓ రేంజ్‌లో వుండాలని మణిశర్మ ప్రయత్నం చేస్తుంటే, వద్దులే కొత్తగా వుండేలా ప్రయత్నం చేయమని కొరటాల అనడంతో ఫైనల్‌గా మరొకటి చేసి ఇచ్చానని మణిశర్మ చెప్పాడు. అదెలా వుందో అందరికీ తెలిసిందేగదా. అలీతో సరదాగా కార్యక్రమంలో మణిశర్మ వెల్లడించాడు. ఇది చిరు అభిమానుల్లో ఆసక్తికరవిషయంగా మారింది.