సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (19:24 IST)

లెంగ్త్ వీడియో ప్లీజ్... “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ నటి ఓవియా రిప్లై

oviya
తమిళ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఓవియాకు సంబంధించి ప్రైవేట్ వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో ఓ క్లిప్ వైరల్ అవుతోంది. అయితే, అది ఒరిజినల్ వీడియోనా.. లేకపోతే డీప్‍ఫేక్ చేసిన మార్ఫింగ్ వీడియోనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ లీకైన ప్రైవేట్ వీడియోపై ఓవియానే స్పందించింది. తాజాగా తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటో కింద వైరల్ వీడియో గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. 
 
లీకైన క్లిప్‍కు సంబంధించిన లాంగ్ వీడియో కావాలని ఓ నెటిజన్ అడిగారు. దానికి కూల్‍గా సమాధానంగా “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ రిప్లై ఇచ్చింది. మీకు సంబంధించిన 17 సెకన్ల వీడియో లీకైంది మేడమ్ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‍కు కూడా ఓవియా. “ఎంజాయ్” అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆ వీడియో తనకు సంబంధించిందే అని ఓవియా చెప్పేశారంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. సదరు వీడియోను ఆమె ఖంచించకపోవడమే అందుకు కారణమంటున్నారు. 
 
ఓవియా ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలు చేసింది. తెలుగులోనూ తరుణ్ సరసన ఇది నా లవ్ స్టోరీ చిత్రంలో నటించింది. 2007లో కంగారూ అనే మలయాళం చిత్రంతో తెరంగేట్రం చేశారు ఓవియా. మరో రెండు మలయాళ చిత్రాల తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఎక్కువగా  తమిళ సినిమాల్లో నటించిన ఓవియా మంచి గుర్తింపు తెచ్చుకుంది.