సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (17:47 IST)

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

Pushpa Raj & Srivalli
Pushpa Raj & Srivalli
అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2. ఆయన భార్య శ్రీవల్లిగా రష్మిక నటించింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పుష్ప రాజ్, శ్రీవల్లి న్యూలుక్ తో ప్రచారాన్ని ఆరంభించారు. డిసెంబర్ 5న సినిమాను వెయ్యికిపైగా స్క్రీన్లతో విశ్వవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 
 
పుష్పరాజ్ చనిపోయిన తర్వాత ఏమయ్యాడు? అసలు చనిపోయాడా? లేదా అంశంతో సీక్వెల్ ఆరంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. నల్లమల అడవుల్లో ఎర్రచందనం అక్రమరవాణాతో ప్రారంభమైన పుష్పరాజ్ కెరీర్ ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ సామ్రాజ్యం విదేశాలకు విస్తరిస్తుందనీ, ఇందులో పరాభాషా ప్రముఖ నటులు కూడా కన్పించనున్నారనీ అది వెండితెరపై చూస్తేనే థ్రిల్ కలుగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌పై  నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ తదితరులు నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.