శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (12:32 IST)

ట్రెండ్ అవుతున్న NTR వీడియో.. సీన్ అదిరింది (వీడియో)

rrrmovie
ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్‌ ఇచ్చే వైల్డ్‌ ఎంట్రీ సీన్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. 
 
ఈ సీన్ చూసి థియేటర్లో ప్రేక్షకులు షాకయ్యారు. ఓ విదేశీ ప్రేక్షకుడు ఈ సీన్‌ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసి.. "నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూశాను. 29 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు కూడా చూశాను. కానీ ఇప్పటివరకు ఇలాంటి అద్భుతమైన ఎంట్రీ సీన్ ఏ సినిమాలో చూడలేదు" అని పోస్ట్ చేశాడు. 
 
దీంతో ఈ వీడియో వైరల్ అయి మరింత మంది దీనిపై ట్వీట్స్ చేశారు. అతి తక్కువ సమయంలో ట్విట్టర్లో ఈ వీడియో 12 మిలియన్‌ వ్యూస్‌ను సాధించింది. గత రెండు రోజుల నుంచి ఈ వీడియో, ఎన్టీఆర్ పేరు, RRR ట్విట్టర్లో మారుమ్రోగిపోతుంది. ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ దాదాపు 1100 కోట్ల కలెక్షన్లను సాధించింది.