బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (15:41 IST)

టైమ్స్ పత్రికలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్..

RRR
RRR
ఆర్ఆర్ఆర్ సినిమాతో జక్కన్న రాజమౌళి పేరు హాలీవుడ్‌లో మారుమోగుతుంది. రాజమౌళి గత రెండు నెలలుగా అమెరికాలోనే ఉంటూ ఆర్ఆర్ఆర్ సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‌లో పాల్గొంటున్నాడు. హాలీవుడ్‌లో కూడా చాలామంది ప్రముఖులు ఇప్పటికే రాజమౌళిని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. 
 
కొంతమంది డైరెక్ట్‌గా కలిసి అభినందిస్తున్నారు. రాజమౌళికి హాలీవుడ్‌లో గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది. 
 
అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్‌లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. హాఫ్ పేజీలో రాజమౌళి ఫోటో వేశారు. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు, రాజమౌళి హర్షం వ్యక్తం చేస్తున్నారు.