ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (09:35 IST)

నా లాగా ఎవరూ చేయొద్దు అంటున్న సునీల్

chiru blesses sunil
chiru blesses sunil
నటుడు సునీల్ సినిమాల్లోకి రాకముందు కాలేజీలో బి.కామ్ చేసి ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నాడట. కానీ చిరంజీవి అనే నటుడిని చూసి ఇన్ స్పైర్ అయి ఆయన్ను ఫాలో అవడం వల్ల నా లైఫే మారిపోయింది. కోట్లమంది అభిమానులను నేను కూడా సంపాదించుకున్నాను. ఇదంతా ఆయనలో వున్న శక్తి ఇంతటివాడిని చేసింది అంటూ చిరంజీవితో కలిసి నటించిన సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు. అలాగే చిరంజీవి ముందే చిరంజీవి అంటూ నాలుగుసార్లు ఆయన ముందు అరిచి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.
 
నాగ, పులి, జ్వాల, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కిరాతకుడు వంటి సినిమాలన్నీ కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు చూసేవాడిని అంటూ గొప్పగా చెప్పుకున్నాడు. ఇది గతంలో జరిగిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇలా అందరూ అవుతారని కాదు. అంటూ ఎవరైనా ముందు చదువుకోండి. ఆ తర్వాతే మన గోల్ ఏమిటో దానివైపు వెళ్ళండి అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.