1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:24 IST)

మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్.. నాగబాబు కామెంట్

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, సామాన్యులు కరోనా బారినపడ్డారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌దేవ్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నవారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ పోస్టుపై నటుడు నాగబాబుతోపాటు, నటి అవికాగోర్‌తో సహా పలువురు సన్నిహితులు, అభిమానులు కళ్యాణ్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు. 
 
స్వల్ప లక్షణాలతో నిన్న పరీక్షలు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా తానూ కోలుకోవాలని కోరుకున్నవారందరికి ధన్యవాదాలు తెలిపాడు. అటు నటుడు నాగబాబు.. కల్యాణ్‌దేవ్‌ పోస్ట్‌పై స్పందిస్తూ.. త్వరగా కోలుకుంటావనే నమ్మకం, గెట్‌ వెల్‌ సూన్‌ మై బాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు.