శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (12:17 IST)

14 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌లో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
విజయ్ దేవరకొండ ఫాలోవ‌ర్స్ సోష‌ల్ మీడియాలో రోజ రోజుకు పెరుగుతూనే వున్నారు. ఆమ‌ధ్య 9 మిలియ‌న్ అయిన ఫాలోవ‌ర్స్ ఈరోజుకు 14 మిలియ‌న్స్‌కు చేరుకున్నాడు. ఇటీవ‌లే సినిమా టిక్క‌ట్ల రేట్ల పెంపు పై తెలంగాణ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఆ త‌ర్వాత యూత్‌లో ఆయ‌న ఫాలోవ‌ర్స్ ఒక్క‌సారిగా పెరిగిపోయారు. తాజాగా లైగ‌ర్ సినిమాను ఆయ‌న చేస్తున్నాడు. కోవిడ్ రాక‌ముందునుంచే ఈ సినిమా లైన్‌లో వుంది. పూరీ జ‌గ‌న్నాథ్‌, చార్మి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు క‌ర‌ణ్ జోహ‌ర్ బాలీవుడ్‌కు తోడుకావ‌డంతో మ‌రింత హైప్ పెరిగింది.
 
సోష‌ల్‌మీడియా విజ‌య్ ఫాలోయింగ్ కార‌ణం కూడా క‌ర‌ణ్‌జోహార్ సినిమా తీయ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలుగులో మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, ఎన్‌.టి.ఆర్‌. కంటే ఆయ‌న ఫాలోవ‌ర్స్ ఎక్కువ‌గా వుండ‌డం విశేషం. విజ‌య్‌కు మొద‌ట సినిమానుంచి సోష‌ల్‌మీడియా కోసం ప్ర‌త్యేక టీమ్ కూడా వుంది. గీత గోవిందం సినిమా ఆయ‌న‌కు యూత్ ఫాలోయింగ్ బాగా వ‌చ్చేలా చేసింది. ఇక టాక్సీవాలా నుంచి అది మ‌రింత పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌తో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వ‌చ్చే ఏడాది ఈ సినిమాను విడుద‌ల చేసే ప్లాన్‌లో వున్నారు. ఈలోగా మ‌రింత మంది ఫాలోవ‌ర్స్‌ పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.