బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:36 IST)

వైఎస్.షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. హస్తినకు రావాలంటూ పిలుపు

sharmila - modi
వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకస్మికంగా ఫోన్ చేశారు. ఆమెతో ఏకంగా పది నిమిషాల పాటు మాట్లాడారు. తక్షణం ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తెలంగాణంలోని అధికార తెరాస పార్టీ దాడి నేపథ్యంలో షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర నేపథ్యంలో ఆమెపై తెరాస శ్రేణులు దాడి చేశాయి. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ఆమె ధ్వంసమైన తన కారులోనే సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ ముట్టడికి వెళుతుండగా ఆమె కారు సీట్లో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయిన విషయం తెల్సిందే. షర్మిల కారులోనే కూర్చొనివుండగా, పోలీసులు ఆమె కారును టోయింగ్ చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 
 
ఈ నేపథ్యంలో షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. పైగా, ఢిల్లీకి రావాలని సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని కోరిక వినతి మేరకు ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. ఏదిఏమైనా షర్మిలకు ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేయడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచనలనంగానూ, చర్చనీయాంశంగాను మారింది.