సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:35 IST)

అలాంటి ప్రేమాయణం నడిపేస్తారు ఆ ప్రేమికులు

ప్రేమలో రకాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ, రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో మన్మథ ప్రేమ ఎలా ఉంటుందంటే.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసమే బతుకుతారు. రతీమన్మథులుగా ప్రతిక్షణం ఒకరి కోసం మరొకరుగా బతుకుతారు. ఇందులో వారి వ్యక్తిగత లోపాల ప్రశ్నంటూ వుండదు.
 
రొమాంటిక్ ప్రేమ విషయానికి వస్తే.. ఇది ప్రేమ కోసం ప్రేమ. కలిసి వున్నప్పుడు వీరికి ఒకరి మీద మరొకరికి వల్లమాలిన ప్రేమ పుడుతుంది. దూరంగా ఉన్నప్పుడు అంతగా వుండకపోవచ్చు. సాహస ప్రేమికులు.. వీరికి ప్రేమించడం ఒక సాహసం. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఒక ఘనకార్యం. అందుకోసమే ప్రేమలో పడతారు. పెళ్ళి తర్వాత కూడా ఇతరులతో ప్రేమాయణం నడపగలిగిన శక్తివంతులు.
 
సమాజం కోసం ప్రేమ.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత మధ్యలో తిరిగి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోయే ప్రేమికులు వీరు. ప్రేమించుకుని తిరిగి విడిపోయారని సమాజం వేలెత్తి చూపుతుందనే భయంతో ప్రేమను కొనసాగిస్తారు. అవతలివారిచ్చే భద్రత నుంచి ప్రేమ పుట్టుకువస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.