సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (10:52 IST)

ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం.. మహాభారత చిత్రాన్ని ఉంచితే?

వాస్తు ప్రకారం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని కొన్ని వస్తువులు ఇంటికి డబ్బు రాకుండా కూడా అడ్డుకుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఎండిన పువ్వులు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి. 
 
పువ్వులు శుభ చిహ్నాలు.. ప్రతి ఒక్కరి దేవుడి గదిలో దేవుడిని పూజించడానికి పూలను ఉపయోగిస్తారు. ఇది అందాన్ని పెంచే సాధనం కూడా.. ఇకపోతే తాజా పువ్వు అయితేనే అందాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. 
 
అలాంటి పువ్వులు వాడిపోతే ఇంట్లో పెట్టకూడదు. ముఖ్యంగా ఎండిన పువ్వులు అరిష్టానికి సంకేతం. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు పటాలపై ఉన్న పువ్వులను మార్చాల్సి ఉంటుంది.
 
మహాభారత చిత్రాన్ని ఉంచడం కూడా అశుభమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మహాభారత చిత్రం ఉండడం వల్ల ఉద్రిక్తత, గొడవలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పెంచుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.