గృహ నిర్మాణానికి వాస్తు చిట్కాలు..?
చాలామంది గృహ నిర్మాణాలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ, ఇంటి చుట్టూ మట్టి ఎత్తుగా నింపుకోవచ్చా లేదా ఒకవేళ నింపుకున్నా ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటివారి కోసం.. ఇంటి ప్రహరీ లోపలి ఆవరణం ఇంటి బలాన్ని, ఆలోచనని, వృద్ధి చేసే విధంగా వినియోగించబడాలి. అప్పుడే ఒకరకంగా అది ఆకర్షణను కలిగిస్తుంది. ఇలాంటి విషయాల్లో చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. అనేకులు ప్రహరీలే కట్టుకోవడానికి ఇష్టపడరు. తక్కువ మంది ఇంటి పరిసరాల విషయంలో గొప్ప శ్రద్ధ వహించి ప్రేరణ పొందుతుంటారు.
ఇంటి చుట్టూ ప్రదక్షిణ స్థలంలో హెచ్చు పల్లాల విషయంలో జాగ్రత్త వహించాలి. నైరుతి కదా అని ఆ మూల మట్టిదిబ్బ చేయవద్దు. ఈశాన్యం కదా అని అటు దిక్కు బొంద చేయవద్దు. సమపట్టాగా తీర్చిదిద్దాలి. ప్రధానంగా ఇంటి ఫ్లోరింగ్ ఎంత ఎత్తు కట్టారో, కట్టాలో నిర్ణయించుకుని ఇంటి ప్రదక్షిణ స్థలం ఎత్తు పల్లాలు నిలుపాలి.
దక్షిణ నైరుతి నుండి తూర్పుగా, పశ్చిమ నైరుతి నండి ఉత్తరంగా పల్లం సాధారణంగా ఏర్పాటు చేసుకోవాలి. నైరుతి మూల ఎత్తు అరుగు కట్టవద్దు. ముఖ్యంగా ఇంటి పీఠం ఎత్తుకన్నా బయటి నైరుతి భాగం తక్కువ ఉండాలి. ఈశాన్యం దిశకన్నా నైరుతి స్థలం ఎత్తుగా ఉండాలి. అప్పుడే పూర్ణశక్తి ఆ ఇంటికి లభిస్తుంది.