పూజ గదిని ఆ దిశలో ఉంటే...?
వాస్తుప్రకారం ఈశాన్యంలో పూజగది ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈశాన్యం అంటే ఈశ్వరుడు. కానీ చాలామంది ఈశాన్య దిశను మూసేస్తుంటారు. అలా చేయకూడదు.. ఎందుకంటే ఈశాన్యంలో శివుడు ఉంటాడని ఆ దిశలో పూజగదిని నిర్మించుకోవడం శుభదాయకమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అలానే ఈశాన్యంలో పూజగది వచ్చినప్పుడు దానికి తూర్పు లేదా ఉత్తర దిశలో ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. కొందరి ఇంట్లో ఈశాన్యంలో బాల్కనీ కట్టుంటారు. అలా ఉండకూడదు. ఈశాన్యంలో పూజగది ఉన్నప్పుడు ఉత్తర దిశలో బాల్కనీ అమర్చుకోవచ్చు. గృహంలో ఈశాన్యం ఓపెన్‌గా ఉంటే.. సిరసంపదలు చేకూరుతాయని విశ్వాసం. కనుక.. వీలైనంత వరకు ఈశాన్యం ఓపెన్‌గా ఉండేలా చూసుకోవాలి.