ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (21:33 IST)

ఇలా చేస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి...

ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నవారు వుంటున్నారు. దీనికి కారణం వంశపారంపర్యం, పోషకాహార లోపం. రసాయనాలు కలపని సహజసిద్ధమైన పేస్టుని వాడటం ద్వారా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
 
రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ మెంతిపొడి, టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం బాగా కలపాలి. గంటసేపు అలాగే ఉంచి, తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నేచురల్ షాంపూతో శుభ్రపరచుకోవాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి.
 
ఇక ఆహారం విషయానికి వస్తే... ఉసిరి (సి-విటమిన్), ఆకుకూరలు, ఖర్జూర (ఐరన్), చేప ఉత్పత్తులు (విటమిన్ -ఇ) ఉండేవి తీసుకోవాలి. వెంట్రుకలపై మసాజ్‌కు నల్ల నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు వెంట్రుకలు తెల్లబడటం, పొడిబారడం సమస్యను నివారిస్తాయి.