బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (17:41 IST)

"సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" లాంఛనంగా ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ష‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐ.టి. శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. 
కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ తో కలిసి "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఈ ‘సీవోఈ’ని నాస్కామ్ ఏర్పాటు చేశారు. 
 
 
రూ.22 కోట్లతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సహానీ వర్చువల్ గా హాజరైయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, విశాఖ జెడ్పీ చైర్ పర్సన్, సుభద్ర, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి,  ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్,  నాస్కామ్ అధ్యక్షుడు దేబ్ జానీ ఘోష్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.