శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (15:39 IST)

ప్రియురాలి ఇంట్లో భర్త.. చితక్కొట్టిన భార్య...

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో ఇబ్బందులుంటాయని తెలిసినా కొందరు అడ్డంగా బుక్కవుతున్నారు. ప్రస్తుతం వరంగల్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. లాక్‌డౌన్ సమయం లోనూ ఓ భర్త బయటకు వెళ్తుండటం ఇంటికి లేటుగా రావడం చేస్తున్నాడు. దీంతో ఆయన భార్య అనేకమార్లు నిలదీసింది.
 
పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటుగా భార్యను కొట్టడం చేస్తున్నాడట. దీంతో భర్తపై అనుమానం కలిగిన భార్య, ఎలాగైనా భర్తను చేస్తున్న పనులను కనిపెట్టాలని అనుకుంది. భర్త అక్రమసంబంధం గురించి తెలుసుకున్న భార్య షాక్ అయ్యింది. వరంగల్‌లోని బీట్ బజార్లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకొని బంధువులతో కలిసి వెళ్లి ప్రియురాలి ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను, ప్రియురాలిని చితకబాదింది.