శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (21:25 IST)

2022 కన్యా రాశి ఫలితాలు: ఆదాయం బాగున్నా కానీ...

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం: 11 వ్యయం: 5 రాజ్యపూజ్యం: 4 అవమానం: 5

 
ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అయితే ద్వితీయార్ధం కొంతమేరకు అనుకూలిస్తుంది. ప్రథమార్థంలో వ్యవహారాలు ఆశించంత అనుకూలంగా సాగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. దంపతుల మధ్య అవగాహన లోపం, తరచు అకాల కలహాలు తలెత్తుతాయి. ద్వితీయార్థం ప్రతికూలతలు తొలగి కుదుటపడతారు. 

 
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవివాహితులకు శుభయోగం. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల వేధింపులతో మనశ్శాంతి ఉండదు. ఒత్తిడి, పనిభారం. మీ సమర్ధత మరొకరికి కలిసివస్తుంది. వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంట దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర నిరుత్సాహం కలిగిస్తుంది. 

 
తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అంతగా కలిసిరావు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆటుపోటుపోట్లు, నష్టాలు తప్పకపోవచ్చు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు విదేశీ, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తరచు దైవకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు విరమించుకోవటం శ్రేయస్కరం.