సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 4 జూన్ 2020 (12:12 IST)

Clade A3i: ‘తెలంగాణ, తమిళనాడుల్లో భిన్నమైన కరోనావైరస్‌’ : ప్రెస్ రివ్యూ

తెలంగాణ, తమిళనాడుల్లో మిగతా దేశంలో పోల్చితే భిన్నమైన కరోనావైరస్ వ్యాప్తిలో ఉందంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది. హైదరాబాద్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులల్‌ బయాలజీ’ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తలు దేశంలో భిన్నమైన కరోనా వైరస్‌ రకాన్ని గుర్తించారు. దీనికి ‘క్లేడ్‌ ఏ3ఐ’ అని పేరుపెట్టారు.

 
దేశంలో మొత్తం 64 జన్యుక్రమాలను విశ్లేషించగా, 41 శాతం జన్యువుల్లో వీటి ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, తమిళనాడులో ఈ రకం వైరస్‌ వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ‘కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌' (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో సీసీఎంబీ పనిచేస్తుంది. సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. తెలంగాణ, తమిళనాడు నుంచి సేకరించిన నమూనాల్లో చాలా వరకు క్లేడ్‌ ఏ3ఐ రకం వైరస్‌ ఉన్నట్లు చెప్పారు.

 
దేశంలో కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే ఈ నమూనాలను సేకరించినట్లు తెలిపారు. దిల్లీలో సేకరించిన నమూనాల్లో క్లేడ్‌ ఏ3ఐకి కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, గుజరాత్‌, మహారాష్ట్ర నమూనాల్లో ఎలాంటి పోలికలూ లేవని వివరించారు. సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లలో గుర్తించిన కరోనా వైరస్‌కు క్లేడ్‌ ఏ3ఐకి దగ్గరి పోలికలు ఉన్నట్లు చెప్పారు