గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 9 జనవరి 2022 (23:30 IST)

ముఖంపై వేపాకు పేస్ట్ పట్టిస్తే....

వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

 
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది. జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. 

 
తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది. ఒక బౌల్‌లో వేపాకుపేస్ట్‌ని తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్నితలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.