బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (19:43 IST)

మళ్లీ షాకిచ్చిన బంగారం.. వెండి ధరలు

gold
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 160 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,900 కు లభిస్తోంది.
 
అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.51,160 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.680 వరకు పెరగడంతో రూ.53,900కు లభిస్తోంది. 
 
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.59,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.53,900 పలుకుతోంది.