కాస్త తగ్గిన బంగారం - వెండి ధరలు...
దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తున్నాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.43,590 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 47,550 కి చేరిది.
అలాగే, దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక అటు… వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.64,900 వద్ద కొనసాగుతోంది.